Dalita Bandhu : నేటి నుంచి దళిత బంధు అమలు..ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

Dalita Bandhu
Dalita Bandhu : దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు ఇవాళ్టి నుంచే దళితబంధు నిధులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు అకౌంట్‌లో జమకానున్నాయి. ఈ మేరకు వాసాలమర్రి గ్రామానికి రూ.7.60 కోట్ల నిధులను మంజూరు చేశారు.
దళిత బంధు వాసాలమర్రిలో లాంఛ్ అయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక హుజూరాబాద్‌లో లాంఛనమేనని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తున్నామన్నారు కేసీఆర్. వ్యవసాయాన్ని నిలబెట్టాలని…ఎన్నో కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రైతులకు కులం లేదని…దళితులు వెనకబడి ఉన్నారు కాబట్టి ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు.
దళిత బంధు ద్వారా దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెడతామన్నారు. ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూసేలా చేయాలన్నారు. ప్రతి ఒక్కరిని ఈ పథకం ద్వారా ఆదుకుంటామన్నారు. వాసాలమర్రి ఆలేరు నియోజకవర్గానికి ఆదర్శం కావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నిధులు వృథా కాకుండా ఉపాధి కలిగే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అతి త్వరలో తాను చెప్పిన విధంగా బంగారు వాసాలమర్రి అవుతుందని సీఎం పేర్కొన్నారు.