Medak : ఏడుపాయల జాతరకు పోటెత్తిన భక్తులు, ఘనంగా అమ్మవారి ఊరేగింపు.. రథోత్సవం
ఏడుపాయల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. అత్యంత కీలకమైన రథోత్సవం గురువారం రాత్రి జరిగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా

Untitled 1
Edupayala Jatara : ఏడుపాయల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. అత్యంత కీలకమైన రథోత్సవం గురువారం రాత్రి జరిగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా భారీగా భక్తులు విచ్చేసి రథాన్ని లాగారు. ఈ అపూర్వ ఘట్టాన్ని లక్షలాది మంది భక్తులు తిలకించారు. భక్తులకు ఎలాంటి అజాగ్రత్తలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. ముందుగా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ ఆలయ మర్యాదాలతో ఎండోమెంట్ ఆఫీసు నుంచి మేళతాళాలతో రెవెన్యూ అధికారులను ఎదుర్కొన్నారు.
Read More : Sammakka Saralamma : మేడారం జాతర.. హెలికాప్టర్ సేవలు, రూ. 20 వేల చార్జీ
అనంతరం అక్కడి నుంచి నాగ్సాన్ పల్లి చేరుకున్నారు. గ్రామ పెద్దకాపు సాయిరెడ్డిని ఎదుర్కొని రథం గోలి వరకు తీసుకొచ్చారు. అక్కడ రథం ముందు అన్నం వండి రాసిగా పోసే కార్యక్రమం జరిగింది. రాజగోపురం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రథాన్ని రంగులు, ఇతర వాటితో అందంగా తీర్చిదిద్దారు. విద్యుదీపాలతో ఆ ప్రాంతం మెరిసిపోయింది. రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. అప్పటి వరకు ఓపికగా భక్తులు వేచి ఉండి కార్యక్రమాన్ని తిలకించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతస్థాయి అధికారుల సమన్వయంతో జాతర విజయవంతంగా ముగిసింది.