దసరా రోజునే ధరణి పోర్టల్

Dharani Portal: రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేసే ధరణి పోర్టల్ ప్రారంభానికి దసరా పండుగ రోజును ఎంచుకున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్. విజయదశమిని జనం మంచి ముహూర్తంగా భాస్తారు. అందుకే సిఎంకూడా ధరణి పోర్టల్‌ను ఆరోజు ప్రారంభిస్తారు. ఈలోగా అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ధరణి పోర్టల్ సమగ్ర రెవెన్యూ వ్యవస్థ. దానికి అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్‌లను రెడీ చేయమని, మారిన రిజిస్ట్రేషన్ విధానం, తక్షణ మ్యుటేషన్, ధరణి పోర్టల్‌లో వివరాలను వెంటనే అప్‌డేట్ చేయడం వంటి అంశాలపై, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. అందుకోసం డెమో ట్రయల్స్ నిర్వహించనున్నారు.