COVID shots : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో వివక్ష..కేంద్ర తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు.

COVID shots
Covid Vaccine Telangana : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు లక్షల రెమిడెసివర్ ఇంజెక్షన్లు ఆర్డర్ ఇస్తే…కేంద్రం కేవలం 21 వేలు మాత్రమే కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని, కేంద్ర మంత్రి హర్షవర్దన్ కు లేఖ రాస్తానని తెలిపారు. ఆక్సిజన్ లేకపోతే..మనుషులు బతకలేరనే విషయం అందరికీ తెలిసిందేన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఏ విధంగా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాల గురించి మంత్రి ఈటెలతో 10tv ముచ్చటించింది.
ఆక్సిజన్ ట్యాంకర్లు 1300 నుంచి 1400 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖపట్టణం ఆక్సిజన్ ను మహారాష్ట్రకు ఇచ్చిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఏర్పడితే..కేంద్రానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని, కేంద్రం మాత్రం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించిందన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సిన్ కొరత లేదని, పది లక్షల డోస్ లు ఇచ్చే శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. జనాభాను బట్టి డోస్ లు పంపించాలని, వ్యాక్సిన్ విషయంలో డబ్బులు చూసే ముఖం తమ ప్రభుత్వం కాదని, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ప్రజలను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి ఉచిత వ్యాక్సిన్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ భారతీయులేనని, వ్యాక్సిన, ఆక్సిజన్, రెమిడెసివర్ తదితర విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాలను పక్కన పెట్టి..ఇతర రాష్ట్రాలకు తరలించడం సబబేనా అన్నారు.
Read More : Corona Second Wave : కరోనాకు ధైర్యమే మందు, స్వీయనియంత్రణే రక్షణ – ఈటెల