Drunk and drive: హైదరాబాద్ లో తప్పతాగి రోడ్లపై మందుబాబుల వీరంగం.. న్యూ ఇయర్ వేడుకల్లో రచ్చ రచ్చ
పోలీసులకు చిక్కిన సమయంలో వారు చేసిన యాక్షన్‌కు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అన్నంత రేంజ్‌లో సీన్లు పండించారు. కొందరేమో పబ్బుల వద్ద వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో నానా హంగామా చేశారు.

Drinkers
drunk and drive in Hyderabad :న్యూ ఇయర్ అంటే.. విషెస్.. కేక్ కటింగ్స్.. సెలబ్రేషన్స్.. అంతేకాదు.. న్యూ ఇయర్ అంటే మందు బాబుల పండుగ. దీంతో.. ఎప్పుడు తాగనట్లు ఫుల్‌గా తాగేశారు మందుబాబులు. న్యూ ఇయర్ వేడుకల్లో రచ్చరచ్చ చేశారు. తప్పతాగిన మైకంలో.. రోడ్లపై వీరంగం సృష్టించారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌కు కారణమైతే.. మరికొన్ని చోట్ల ప్రమాదానికి కారణమయ్యారు. తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయారు. హడావుడి చేస్తూ కెమెరాలకు చిక్కారు.
పోలీసులకు చిక్కిన సమయంలో.. వారు చేసిన యాక్షన్‌కు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అన్నంత రేంజ్‌లో సీన్లు పండించారు. కొందరేమో పబ్బుల వద్ద వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో నానా హంగామా చేశారు. హైదరాబాద్‌లోని టాట్ పబ్ వద్ద. మరోసారి న్యూసెన్స్ క్రియేట్ చేశారు యువతీయువకులు. మద్యం బాటిల్లు రోడ్లపై పడేసి వీరంగం సృష్టించారు. పబ్ వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. చేసేదేమీలేక చేతులెత్తేశారు పబ్ నిర్వాహకులు.
New Year Celebrations : వెల్‌కమ్ 2022.. బైబై 2021 : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చేసింది. 2021కి గుడ్ బై చెప్పేసి.. 2022కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేసింది యావత్ దేశం. 2022లోకి అడుగు పెట్టిన వేళ.. దేశ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబురాల్లో.. తగ్గేదేలే అన్నట్లు జోష్ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకై పరిమితై వేడుకలు జరుపుకుంటున్నారు. హుషారైన పాటలతో సైనికులు హోరెత్తించారు. డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నిన్న సాయంత్రం నుంచే మొదలైన న్యూ ఇయర్ ఉత్సాహం అర్ధరాత్రి అయ్యే సరికి అంబరాన్ని తాకింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతల కోలాహలంతో మార్మోగింది.