Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఈడీ ముందుకు కేటీఆర్.. అడిగే ప్రశ్నలు ఇవే?
వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు.

KTR
Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా గురువారం ఈడీ ముందు మాజీమంత్రి కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ ను ఈడీ విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ విచారణకు కేటీఆర్ ఒక్కరే హాజరవుతారా? లేక న్యాయవాదితో అటెండ్ అవుతారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ..
ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించింది ఈడీ. వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు.
Also Read : ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడి.. పవర్ గ్రిడ్ మూసివేత.. రంగంలోకి నాటో యుద్ధ విమానాలు!
సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు..
అటు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కోన్నారు కేటీఆర్. అలాగే ఈడీ విచారణను పూర్తి చేసుకున్నారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి. ఇక ఇప్పుడు కేటీఆర్ ను ఈడీ విచారించనుంది.
తీవ్ర దుమారం రేపిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసు..
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతుంటే మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సైతం దర్యాఫ్తు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఆర్) కింద కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఇద్దరు అధికారులను (ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి) విచారించి వారి స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నారు.
ఈడీ అడిగే ప్రశ్నలు ఇవేనా?
మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు అటెండ్ అవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా గతంలో కార్ రేసింగ్ కేసులో నిధుల బదిలీకి సంబంధించిన అంశాలు, బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనలపై పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.

Formula E-Car Race Case
ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు? ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ నిబంధనలను ఎలా తప్పుదోవ పట్టించారు? అనేదానిపై కేటీఆర్ నుంచి స్టేట్ మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దానకిశోర్ స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ ఎవిడెన్స్ అన్నీ కేటీఆర్ ముందు ఉంచి ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.
Also Read : ఆ ఇద్దరి టార్గెట్ కేజ్రీవాల్..! ఢిల్లీ ఎన్నికల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య? ఆసక్తి రేపుతున్న హస్తిన రాజకీయం..