Telangana Politics : జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవటానికి ఈటల యత్నాలు, ఢిల్లీ పెద్దలతో మంతనాలు
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.

Etala Jupalli and Ponguleti
Telangana Politics : పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, (Ponguleti Srinivas Reddy),మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)లను బీఆర్ఎస్ (BRS Party) పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వీరిద్దరు ఏపార్టీలో చేరతారు?అనేది ఆసక్తికరంగా మారుతున్న క్రమంలో వీరిద్దరిని బీజేపీలో చేర్చుకోవటానికి తెలంగాణ కాషాయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.
దీంట్లో భాగంగానే వారిద్దరిని బీజేపీ చేర్చుకోవటానికి ఒకప్పటి బీఆర్ఎస్ నేత ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ చొరతీసుకున్నారు. జూపల్లిని, పొంగులేటిని బీజేపీ చేర్చుకుంటే పార్టీకి మంచి జరుగుతుందనే భావనతో ఢిల్లీ పెద్దలతో చర్చలు జరటానికి వెళ్లారు ఈటల రాజేందర్. తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల బీఆర్ఎస్ వేటుతో జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చేందుకు సంబంధించిన వ్యవహారంపై ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో చర్చించి వీరిద్దరి చేర్చుకోవటంపై నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడుతున్న ఈ రెబల్ నేతలిద్దరు బీజేపీలో చేరతారా? లేదా మరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాగా..పొంగులేటీ అనుచరులు ఆయన్ని కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన ఆలోచనలు మాత్రం బీజేపీవైపే ఉన్నట్లుగా సమాచారం.
కాగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పొంగులేటితో టచ్లోకి వెళ్లారని మంతనాలు జరిపారని ఇక డైరెక్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే రంగంలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు పొంగులేటి రెబల్ రాగం అందుకున్నప్పటినుంచి ఆయన్ని వైఎస్సార్టీపీ (YSRTP) లో చేర్చుకోవాలని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) యత్నించారు. దీని కోసం ఇప్పటికే వైఎస్ షర్మిల, విజయమ్మతో (YS Vijayamma) పొంగులేటి విడివిడిగా భేటీ కూడా అయ్యారు. దీంతో ఇక పొంగులేటి అడుగులు వైఎస్సార్టీపీలోకే అనే వార్తలు వచ్చాయి. ఈక్రమంలో వీరిద్దరు ఏ గూటికి చేరతారు? అనే విషయం తెలియాల్సి ఉంది.
BRS Suspends Ponguleti: వేటు పడింది..! బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్