BJP Telangana: ఈటల రాజేందర్‭కు ప్రమోషన్ ఇచ్చిన బీజేపీ.. కొత్తగా వచ్చిన పదవేంటో తెలుసా?

2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి

BJP Telangana: ఈటల రాజేందర్‭కు ప్రమోషన్ ఇచ్చిన బీజేపీ.. కొత్తగా వచ్చిన పదవేంటో తెలుసా?

Updated On : July 4, 2023 / 4:17 PM IST

Etala Rajendra: తెలంగాణ సహా మరో ఎనిమిది రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చిన భారతీయ జనతా పార్టీ.. పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్‭కు కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు మంగళవారం పార్టీ అధినేత జేపీ నడ్డా ఉత్తర్వులు విడుదల చేశారు. దీనికి ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చారు. నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్‭ని అధ్యక్షుడిగా తొలగిస్తూ వేరే వ్యక్తిని ఆ స్థానంలో నియమిస్తారనే ఊహాగాణాల మధ్య.. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

Minister Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లిపై అభిమానంతో.. బహుమతిగా రక్తంతో గీసిన పెయింట్..

అయితే అధ్యక్ష పదవి కిషన్ రెడ్డికి ఇచ్చిన కాషాయ పార్టీ అధిష్టానం.. ఈటలకు ముందుగా వచ్చిన ఊహాగాణాల ప్రకారమే ఎన్నికల నిర్వహణ కమిటీ ముఖ్యుడిగా నియమించింది. 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు నిజంగానే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అనేది చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Minister Jogiramesh: వంగవీటి రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన మాకే ఉంది ..

ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పురంధేశ్వరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులు ఈ మార్పులో ఉన్నారు. జార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బాబూలాల్ మారండి, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్‭లను నియమించారు.