తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ.. అధిష్టానం పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు!
తెలంగాణ బీజేపీ అధ్యక్ష స్థానంకు త్వరలో నూతన వ్యక్తి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Telangana BJP New President
Telangana BJP President Post : తెలంగాణ బీజేపీ అధ్యక్ష స్థానంకు త్వరలో నూతన వ్యక్తి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆదివారం మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read : ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరణ.. రైతుల ఫైలుపై తొలి సంతకం
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానంలో విజయం సాధించింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీకే అరుణ విజయం సాధించారు. వీరిద్దరూ కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఈటల, డీకే అరుణ ఆశిస్తున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Also Read : Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రిగా బండి సంజయ్.. కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా..!
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై ఈటల రాజేందర్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న తనకు సన్నిహితుడైన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను ఈటల కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాను కలిసిన తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.