KCR : తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయం- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు.

KCR : తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయం- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Updated On : February 11, 2025 / 9:36 PM IST

KCR : ఉపఎన్నికలపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల్లో బుద్ధి చెబుతారని కేసీఆర్ చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ లోనూ ఉపఎన్నిక వస్తుందని, కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ జోస్యం చెప్పారు.

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఉపఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్ లో చేరనున్నారు.

Also Read : ఎంత AI విప్లవం వచ్చినా.. ఈ మూడు జాబ్స్ కి ఢోకా లేదు పోండి.. బిల్ గేట్స్ ఎనాలసిస్

ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయం..
ఇవాళ కేసీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య పలు కీలక అంశాలపై చర్చించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఉపఎన్నికల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. తాజాగా రాజయ్యతో గులాబీ బాస్ అలాంటి వ్యాఖ్యలు చేశారు.

స్టేషన్ ఘన్ పూర్ లోనూ ఉపఎన్నిక వస్తుందని, కడియం శ్రీహరి ఓడిపోతారని, రాజయ్య గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు కేసీఆర్. నియోజకవర్గానికి చెందిన కొందరు సోషల్ మీడియా వారియర్లపై కడియం శ్రీహరి అక్రమ కేసులు పెట్టించి జైలుకి వేసి వేధింపులకు గురి చేస్తున్నారని రాజయ్య ఆరోపించారు. కొందరు బాధితులను తన వెంట తీసుకెళ్లిన ఆయన.. కేసీఆర్ ను కలిశారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం..
మరోవైపు బీఆర్ఎస్ ను వీడిన కొందరు నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15వ తేదీన కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అంటూ రాజయ్యతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కచ్చితంగా ఆ 10 నియోజకవర్గాల్లో బై పోల్స్ వస్తాయని, అన్నింటిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ పై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. దీనికి సంబంధించి గత రెండు మూడు రోజుల క్రితం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీన మరోసారి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత కేసును విచారించనుంది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొందరు తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అన్న సంకేతాలు కూడా ఇస్తుండటం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఏప్రిల్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి రిటైర్మెంట్.. కొందరు అధికారుల్లో అసంతృప్తి ఎందుకు ఉంది?

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఉపఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్ లో చేరనున్నారు.