Eatala Rajender : మరో పదవికి ఈటల గుడ్ బై

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు.

Eatala Rajender : మరో పదవికి ఈటల గుడ్ బై

Nampally Eetela Rajendar

Updated On : June 16, 2021 / 8:13 AM IST

Nampally Exhibition Society : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు.

బీజేపీలో చేరిన అనంతరం హైదరబాద్ కు చేరుకున్న ఈటల..తన రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి పంపించారు. 2014 నుంచి ఆయన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగుతున్నారు. సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై..రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా మంత్రి కేటీఆర్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంత్రిగా కొనసాగిన ఈటలపై భూ ఆరోపణలు రావడం సంచలనం రేకేత్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి ప్రభుత్వం తప్పించింది. ఎమ్మెల్యే పదవితో పాటు..టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఈటల రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి..బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు.