Jeevan Reddy: Jeevan Reddy: బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి..! ఈ నెలలోనే గులాబీ కండువా కప్పుకునే చాన్స్..!
ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించబోతోంది. ఆ ప్లీనరీ లోపే బీఆర్ఎస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని జీవన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
- ఈ నెలలోనే బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి
- జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్
- ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ
Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఈ నెలలోనే కారెక్కనున్నట్లు సమాచారం. గులాబీ పార్టీలో తన చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం. కేటీఆర్ ఆహ్వానించగానే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించబోతోంది. ఆ ప్లీనరీ లోపే బీఆర్ఎస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని జీవన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
అటు జగిత్యాలలో ప్లీనరీ నిర్వహించడంపై బీఆర్ఎస్ సమాలోచనలు జరుపుతోంది. కార్యకర్తలు, నాయకులతో మాత్రమే ప్లీనరీ జరిగే చాన్స్ ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి కేటీఆర్ రాగానే ప్లీనరీ నిర్వహణపై కార్యాచరణ రూపొందించనున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు కూడా చేశారు. అటు రాజీనామా చేసిన నాటి నుంచి జనంలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బలమైన నేతగా ఉన్న జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరితే స్థానికంగా బీఆర్ఎస్ కు మంచి ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: కొత్తగా 2 లక్షల మందికి ఫించన్లు.. ఈ పత్రాలన్నీ ఉన్నాయా.. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే
