Ktr : ఏపీలో జగన్ గెలుస్తున్నారని సమాచారం..! కాంగ్రెస్‌కి వచ్చేది ఒక్కటే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.

Ktr : ఏపీలో జగన్ గెలుస్తున్నారని సమాచారం..! కాంగ్రెస్‌కి వచ్చేది ఒక్కటే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Ktr : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి.. ధీమాగా ఉన్నాయి. మరోసారి గెలుపు మాదే అని వైసీపీ, ఈసారి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ.. ఇలా ఎవరికి వారు విశ్వాసంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఏపీలో గెలిచేది ఎవరు అన్నదానికి సంబంధించి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారాయన.

తెలంగాణభవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో కేటీఆర్ పలు అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎంపీ అభ్యర్థులతో మాట్లాడా, ఎలక్షన్ చక్కగా జరిగిందని కేటీఆర్ అన్నారు. నేను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించాను ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెబుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు కేటీఆర్. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు.

”కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కరెక్ట్ గా లేరు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడ్డాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లాభం జరిగే అవకాశం ఉంది. పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశారు. సిరిసిల్లలో వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదు. కావాలంటే మీరు వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగండి.

సునీత మహేందర్ రెడ్డికి, మల్కాజ్ గిరికి ఏమన్నా సంబంధం ఉందా? ఆమె అక్కడ కాంగ్రెస్ క్యాండేట్ ఏంది? బండి సంజయ్ ని గెలిపించాలని అడ్రస్ లేని వారికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వెలిచాల రాజేశ్వరరావు ఎవరు? నాగర్ కర్నూల్ లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి. ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావుని కమ్మ సామాజికవర్గం గెలిపించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరే చూడండి” అని కేటీఆర్ అన్నారు.

Also Read : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్