Ramachandra Reddy : మాజీమంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత.. కాంగ్రెస్‌కు తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి
రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజాసేవకు అంకితమయ్యారని, నిజాయితీ-క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు... Ramachandra Reddy

Ramachandra Reddy(Photo : Twitter)
Ramachandra Reddy Dies : మాజీమంత్రి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే చిలుకూరి రామచంద్రారెడ్డి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చికిత్స తీసుకుంటూ ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు.
మాజీమంత్రి రామచంద్రారెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజాసేవకు అంకితమయ్యారని, నిజాయితీ-క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు.
రామచంద్రారెడ్డి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 1978, 1985, 1989, 2004 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2013లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.