NRI Yashasvi : ఎన్ఆర్ఐ యశస్విని అరెస్టు చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు.. విడిచి పెట్టాలని టీడీపీ నేతలు ఆందోళన

సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో యష్ పోస్టులు పెట్టాడు.

NRI Yashasvi : ఎన్ఆర్ఐ యశస్విని అరెస్టు చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు.. విడిచి పెట్టాలని టీడీపీ నేతలు ఆందోళన

NRI Yashasvi

Updated On : December 23, 2023 / 10:40 AM IST

AP CID Arrest NRI Yashasvi : ఎన్‌ఆర్‌ఐ యశస్వి పొద్దులూరిని అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. గత కొంత కాలంగా ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని అతన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. యశస్విని అరెస్ట్ అక్రమం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగానే అతన్ని అరెస్ట్ చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐ యశస్వి పొద్దులూరి (యష్)ని ఏపీ సీఐడీ అధికారులు శనివారం హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూడడానికి యశస్వి స్వదేశానికి వచ్చాడు. సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో యష్ పోస్టులు పెట్టాడు.

Covid-19 cases : ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు

అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీరుగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో యష్ నివసిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి శనివారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యష్ అరెస్టు ను తెలుగుదేశం నేతలు ఖండించారు. జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా? అని ప్రశ్నించారు.