Telangana : రేపటి నుంచి రూ.50 వేల లోపు రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు

తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Telangana : రేపటి నుంచి రూ.50 వేల లోపు రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు

Farmer

Updated On : August 15, 2021 / 8:29 PM IST

Farmer Loan waiver : తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 6,06,811 మంది రైతులకు రూ.2,005.85 కోట్ల రుణమాఫీ జరుగనుందని పేర్కొన్నారు. రైతుల అకౌంట్లల్లో నేరుగా రుణమాఫీ డబ్బులు జమ కానున్నట్లు తెలిపారు. రూ.25 వేలపైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు రూ.50వేల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

ఇందుకోసం నేటి నుంచి మొదటగా రూ.25 వేల నుంచి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. రూ.25 వేలు, రూ.26 వేలు, రూ.27 వేలు.. ఇలా స్లాబుల వారీగా రైతుల అకౌంట్లల్లో రుణమాఫీ మొత్తం డబ్బులు జమ అవుతుందని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు రూ.2005.85 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లల్లో జమ చేస్తామని చెప్పారు.

రేపటి నుంచి రెండో దఫా రుణమాఫీ ప్రారంభం కానున్న సందర్భంగా రైతాంగానికి మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 2014 నుంచి 2018 వరకు రూ.రూ.16,144.10 కోట్ల రుణమాఫీ అయినట్లు తెలిపారు.

సమైక్య రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగానికి కేసీఆర్ ఆసరాగా నిలిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా కేసీఆర్ నిలిపారని కొనియాడారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.