Nampally Exhibition Fire : హైదరాబాద్‌లో మరోసారి మంటల కలకలం.. నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర తప్పిన భారీ ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర కార్లలో మంటలు చెలరేగాయి. గాంధీభవన్ సమీపంలోని గృహకల్ప భవనం ముందు ఎగ్జిబిషన్ కు వచ్చిన వారు కార్లు పార్క్ చేశారు. ఇందులోని ఒక ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు చేలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు వ్యాపించాయి.

Nampally Exhibition Fire : హైదరాబాద్‌లో మరోసారి మంటల కలకలం.. నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర తప్పిన భారీ ప్రమాదం

Updated On : January 21, 2023 / 10:53 PM IST

Nampally Exhibition Fire : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర కార్లలో మంటలు చెలరేగాయి. గాంధీభవన్ సమీపంలోని గృహకల్ప భవనం ముందు ఎగ్జిబిషన్ కు వచ్చిన వారు కార్లు పార్క్ చేశారు. ఇందులోని ఒక ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు చేలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Also Read..Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ బిల్డింగ్ లో ఒక అస్థిపంజరం లభ్యం

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

నాంపల్లి ఎగ్జిబిషన్ కు వచ్చే వారి కోసం అక్కడ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వాహనదారులు తమ వాహనాలను అక్కడ పార్క్ చేశారు. అక్కడ చాలా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. అలాంటి చోట ఊహించని విధంగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. మంటలు మరిన్ని వాహనాలకు వ్యాపించి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సకాలంలో మంటలను ఆర్పి వేయడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, మొన్న సికింద్రాబాద్ లోనూ భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ బిల్డింగ్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. 22 ఫైరింజన్లతో దాదాపు 12 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.