Hyderabad : సుబ్బయ్య గారి హోటల్‌లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.

Subbaiah Gari Hotel
Subbaiah Gari Hotel : హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. నగరంలోని వనస్థలిపురం(Vanasthalipuram) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్ లో 40మంది చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా ఘటనా స్థలానికి వచ్చి మంటల్ని ఆర్పే యత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న 40 మందిని సురక్షితంగా రక్షించారు.
హైదరాబాద్ నగరంలో లక్షలాది హోటల్స్, ఫుడ్ సెంటర్లు ఉన్నా సుబ్బయ్యగారి హోటల్ కు ప్రత్యేకత ఉంది. అరిటాకులో భోజనం.. 12 నుంచి 16 రకాల వంటకాలతో సబ్బయ్యగారి హోటల్ లో భోజనం మంచి ఫేమస్. ఈ హోటల్ కు వెళ్లినవారికి గోదావరి రుచులతో.. సిబ్బంది అత్యంత మర్యాదగా దగ్గరుండి మరి వడ్డిస్తారు. బంధువుల్లా కొసరి కొసరి వడ్డిస్తారు. ఆకలి లేకపోయినా తినాలనిపించే రుచులు సుబ్బయ్యగారి హోటల్ లో ప్రత్యేకత.
Also Read: సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ట్విస్ట్… పాక్ దోపిడీ దొంగ హెచ్చరిక
కాకినాడ వెళితే సుబ్బయ్యగారి హోటల్ లో భోజనం చేసి తీరాల్సిందే. అక్కడ భోజనం చేయకుండా సాధారణంగా ఎవ్వరు ఉండరు. అటువంటి సుబ్బయ్యగారి హోటల్ ఎన్నో బ్రాంచీలతో హైదరాబాద్ నగరంలో కూడా అందుబాటులో ఉంది. కూకట్‌పల్లి, మలక్‌పేట, కొండాపూర్, అమీర్ పేట, వనస్థలిపురం వంటి పలు ప్రాంతాల్లో సుబ్బయ్యగారి హోటల్ ఉంది. 68 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ‘సుబ్బయ్యగారి హోటల్’ ఎంత ఫేమస్సో నగరవాసులకు తెలిసిందే.