Flyover Collapse: ఎల్బీనగర్‌లో కూలిన ఫ్లైఓవర్ ర్యాంప్.. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం?

ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు కూడలిలో ప్లైఓవర్ నిర్మాణ పనుల సమయంలో ప్లైఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Flyover Collapse: ఎల్బీనగర్‌లో కూలిన ఫ్లైఓవర్ ర్యాంప్.. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం?

Flyover Ramp Collapse

Updated On : June 21, 2023 / 9:08 AM IST

Hyderabad: ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు కూడలిలో ప్లైఓవర్ నిర్మాణ పనుల సమయంలో విషాదం చోటు చేసుకుంది. ప్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చనే అనుమానంతో పొక్లెయిన్ సహాయంతో శిథిలాలను తొలగించే ప్రక్రియలో సిబ్బంది నిమగ్నమయ్యారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేజర్ ప్రాజెక్టు అధికారులు ఘటన స్థలం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.