చిన్న పరిశ్రమలకు రూ.3లక్షల కోట్ల రుణాలు

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 11:57 AM IST
చిన్న పరిశ్రమలకు రూ.3లక్షల కోట్ల రుణాలు

Updated On : June 26, 2020 / 8:41 PM IST

ప్రధాని మోడీ ప్రకటించిన ఎకానమీ ప్యాకేజీను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మంగళవారం ప్రధాని రూ. 20 లక్షల కోట్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీపై పూర్తి వివరాలతో బుధవారం సాయంత్రం ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కేంద్రం ఫోకస్ చేసింది. ఈ తరహా పరిశ్రమలకు రుణాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. 

ఈ నిర్ణయం కారణంగా 45 లక్షల కంపెనీలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాల పరిమితి ఉంటుందని వీటిపై మారటోరియం కూడా వర్తిస్తుందని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 20 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. దాదాపు 2 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ది కలుగుతుందని అన్నారు. 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అర్థం మారాలని ఆమె అన్నారు. ఆయా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల మొత్తాన్ని పెంచడంతోపాటు టర్నోవర్ సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు తెలిపారు. 25లక్షలుగా ఉన్న ఆ పరిశ్రమలు రూ.1కోటి వరకూ పరిమితులు ఇస్తున్నట్లు తెలిపారు. రూ.5కోట్లు టర్నోవర్ ఉన్న పరిశ్రమలను కూడా మైక్రో యూనిట్లుగా పరిగణిస్తామని వెల్లడించారు. 

ఫిస్కల్, ఇతర బెనిఫిట్లు పొందేలా ఇన్వెస్ట్‌మెంట్, టర్నోవర్ లిమిట్స్ ను పెంచుతామని అన్నారు. విదేశాల నుంచి వచ్చే టెండర్లను నిషేదిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే టెండర్లు వేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ రకంగా ఆ కంపెనీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Read Here>> ఆర్థిక ప్యాకేజీ :పరిశ్రమలకు 20 శాతం అదనంగా లోన్లు..కార్మికులకు మూడు నెలల వేతనాలు!