KCR: మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.

KCR
KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి మరోసారి వెళ్లారు. గత కొన్నిరోజుల నుంచి జలుబు, ఇతర సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు సాధారణ, గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే నందీనగర్ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఐదు రోజులపాటు బంజారాహిల్స్ నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. అయితే, శనివారం ఉదయం మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. పలు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది. కాగా.. గతంలోనూ పలుమార్లు వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. కేవలం వైద్య పరీక్షల నిమిత్తం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది.
ఇదిలాఉంటే.. కాళేశ్వరం కమిషన్ విచారణ నిమిత్తం జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా సుమారు గంటపాటు ఆయన్ను కమిషన్ ప్రశ్నించింది.