A.Chandrasekhar : బీజేపీకి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ రాజీనామా.. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా మార్చినప్పటి నుంచి అసంతృప్తి
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుచుకుని మాట్లాడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ.చంద్రశేఖర్ దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు.

A.Chandrasekhar Resigned BJP
A.Chandrasekhar Resigned BJP : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి, వికారాబాద్ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏ.చంద్రశేఖర్ రాజీనామా లేఖ పంపారు. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా మార్చినప్పటి నుంచి పార్టీలో ఏ.చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే స్వయంగా ఈటల రాజేందర్.. ఏ.చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు.
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుచుకుని మాట్లాడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ.చంద్రశేఖర్ దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు. అయితే మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.
CM KCR: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ అధినేత
మరోవైపు కాంగ్రెస్ నేతలు, అధిష్టానంతో మంతనాలు పూర్తి అయినట్లు సమాచారం. ఆగస్టు 18న ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఏ.చంద్రశేఖర్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ లేదా చేవెళ్ళ నుంచి ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.