ఎన్టీఆర్ నాకు దైవసమానులు.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత : ఎర్రబెల్లి దయాకరరావు

ఎన్టీఆర్ నాకు దైవ సమానులు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఎన్టీఆర్ నాకు దైవసమానులు.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత : ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli Dayakar Rao

Updated On : May 28, 2024 / 11:05 AM IST

Errabelli Dayakar Rao : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలతో అంజలి ఘటించారు. అనంతరం దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read : NTR 101 Birth Anniversary : ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి

ఎన్టీఆర్ నాకు దైవ సమానులు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత. నేను మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిని. 25ఏళ్ల వయస్సుకే నాకు వరంగల్ జిల్లా పార్టీ పదవి ఎన్టీఆర్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో 26ఏళ్లకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణం. పెన్షన్లు, కిలో రెండు రూపాయల బియ్యం పరిచయం చేసిందే ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎర్రబెల్లి అన్నారు.