BRS Leader KTR : మాకోసం మరో తేదీని కేటాయించండి.. శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ కార్యదర్శికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేకపోయానని తెలిపారు.

BRS Leader KTR :  మాకోసం మరో తేదీని కేటాయించండి.. శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

BRS Leader KTR

Telangana Assembly : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత రెండు రోజుల క్రితం సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. తరువాత డిప్యూటీ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంకు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాలేక పోయారు. వీరిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శాసనసభ కార్యదర్శికి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు.

Also Read : Harish Rao : రైతు బంధు ఎప్పుడిస్తారు? : హరీశ్ రావు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో గురువారం రాత్రి గాయపడ్డారు. హుటాహుటీన సోమాజిగూడ యశోధ ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎడమ తుంటికి గాయం అయిందని గుర్తించారు. హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమైంది. తాజాగా కేసీఆర్ ను ఆస్పత్రి వైద్యులు వాకర్ తో నడిపించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతుండటంతో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఆస్పత్రిలో ఉండిపోయారు. దీంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు.

Also Read : KCR Health : కోలుకుంటున్న కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన వైద్యులు.. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ కార్యదర్శికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా బీఆర్ఎస్ శాసనసభ సమావేశానికి హాజురు కాలేకపోయాను. అదేవిధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేకపోయానని కేటీఆర్ తెలిపారు. ఈరోజు హాజరుకాని మరో నాలుగైదుగురు ఎమ్మెల్యేలతో కలిపి ప్రమాణ స్వీకారం చేయడానికి మరో తేదీని కేటాయించాలని అసెంబ్లీ సెక్రటరీని కేటీఆర్ ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు.