Etela Rajender: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. 14న బీజేపీలోకి ఈటల!

బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.

Etela Rajender: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. 14న బీజేపీలోకి ఈటల!

Etela Rajender To Join Bjp

Updated On : June 11, 2021 / 11:57 AM IST

Etela Rajender to join BJP: బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.

ఈటల ఇప్పటికే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. రేపు(12 జూన్ 2021) మధ్యాహ్నం 11గంటకు రాజీనామా చేయనున్నారు ఈటల.

గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపనికి నివాళి అర్పించి అనంతరం.. అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందివ్వనున్నారు. రాజీనామాపై స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పటికే కోరినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

తర్వాత 13వ తేదీన ప్రత్యేక విమానంలో ఈటల వర్గం ఢిల్లీ వెళ్లనుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈటల చేరికతో బీజేపీ మరింత బలోపేతం కానుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.