KTR Quash Petition: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. దక్కని ఊరట
ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Formula E car race case_ KTR gets no relief in Supreme Court
Formula E race case Updates: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-రేసు పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మంగళవారం సాయంత్రం కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, క్వాష్ పిటీషన్ ను శుక్రవారం అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Also Read: కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులెవరో తెలుసా..? ఎన్ని ప్రశ్నలు రెడీ చేశారంటే..
ఈనెల 15న కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై విచారణ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదేరోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను విచారించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయ పడింది.