Telangana : మంచిర్యాలలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్ ..

మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలలో కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

Telangana : మంచిర్యాలలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్ ..

maoists arrested

Four maoists arrested : ఐదు రాష్ట్రాల ఎన్నికలు .. రేపు మిజోరాం మినహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోలింగ్ ఓట్ల ఎన్నికలు జరుగున్నాయి. ఈక్రమంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా మావో ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంట్లో భాగంగా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మావోల కదలికలపై ఆచూకీ తెలుసుకుంటున్నారు.

దీంట్లో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాసింపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో షెల్డర్ తీసుకుంటున్న వృద్ధ దంపతుల వద్ద తుపాకులు ఉన్నట్లుగా గుర్తించారు.. దీంతో ఆ దంపతులు ఎవరు..? వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయా..? లేదా వారు మావోల సానుభూతిపరులా..? పోలీసుల సమాచారం మావోలకు అందిస్తున్నారా..?వారు ఆ ఇంట్లో ఎందుకున్నారు..? అనే పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

Maoist : మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు .. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటి

కాగా..మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలలో కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోల వారోత్సవాలను భగ్నం చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని కోసం మావోల ప్రభావిత రాష్ట్రాలతో పాటు రాష్ట్రాల సరిహద్దుల్లో డ్రోన్లతో మావోల కదలికలపై కన్నేశారు.

కాగా..మావోల జాడల్ని కనుగొనే క్రమంలో మంచిర్యాల జిల్లా ఇందారం సమీపంలోని ఓ ఓవర్ బ్రిడ్జ్ ఓ మాజీ మావోయిస్టు ఇంట్లో ఉన్న నలుగురు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి రామగుండానికి తరలించారు.SIB నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.గత ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా పోలీసులకు నిఘా వర్గాల వెల్లడించాయి. దీంతో నిఘా పెట్టి మాజీ మావోయిస్టు ఇంట్లో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.PLGA వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోడానికే వచ్చినట్టుగా సమాచారం.