Gaddar New Political Party: కేసీఆర్ విధానాలు తప్పు.. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసమే ‘గద్దర్ ప్రజా పార్టీ’

ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరుతా. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా అని గద్దర్ చెప్పారు.

Gaddar New Political Party: కేసీఆర్ విధానాలు తప్పు.. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసమే ‘గద్దర్ ప్రజా పార్టీ’

Gaddar Announce New Political Party

Updated On : June 21, 2023 / 1:20 PM IST

Praja Party President Gaddar: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ని ప్రకటించారు. అతని నూతన పార్టీ పేరు ‘గద్దర్ ప్రజా పార్టీ’ (Gaddar Praja Party). అయితే, పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బుధవారం గద్దర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడారు. నెలరోజుల్లో నూతన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని గద్దర ప్రకటించారు. సీఎం కేసీఆర్ (CM KCR) హయాంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు, పుచ్చిపోయిన తెలంగాణను చేశారంటూ విమర్శించారు. కేసీఆర్ విధానాలు తప్పు. ధరణి పేరుతో భూములు మింగాడు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదు, దొరల పరిపాలన జరుగుతోందని అన్నారు. 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానని గద్దర్ చెప్పారు.

Gaddar : ఆ పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగింది- గద్దర్ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగం తీసుకొని ఓట్ల యుద్ధానికి సిద్ధంకావాలి. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానని గద్దర్ చెప్పారు. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా. సచ్చే ముందు సత్యమే చెపుతున్నా. నేను భావ విప్లవకారుడిని, అయిదేళ్ళ అడవిలో ఉన్నా అంటూ గద్దర్ అన్నారు.

వేల మంది అమరుల కారణంగా తెలంగాణ వచ్చింది. దొరల రాజ్యం వద్దని తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించి పదేళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా పాలన సాగడం లేదని గద్దర్ అన్నారు. కనీసం జీవించే హక్కుకూడా తెలంగాణ ప్రజలకు లేకుండా పోయిందంటూ గద్దర్ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజా పార్టీని స్థాపిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగాలి. జీవించే హక్కు సహా ఐదు అంశాలు ఆధారంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Revanth Reddy: పొంగులేటి, జూపల్లితో భేటీకానున్న రేవంత్.. కాంగ్రెస్‌లో చేరిక, పలు అంశాలపై చర్చ

ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాను. పార్టీ నిర్మాణం చేస్తాను. పార్టీ జెండా, ఎజెండా.. ప్రజల జెండా ఎజెండానే. ప్రలోభాల నుండి ఓటుని రక్షించడమే నా లక్ష్యం. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ఒక విధానం, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. నా పార్టీ ఎవరితో కలిసి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నా వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్లే నా బలం, నా శక్తి అని గద్దర్ అన్నారు.