Lovers : ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఆ విషయం తెలిసిన యువతి రైలుకింద పడి తనువు చాలించింది.

Lovers : ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

Lovers

Updated On : September 28, 2021 / 8:02 PM IST

Lovers : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఆ విషయం తెలిసిన యువతి రైలుకింద పడి తనువు చాలించింది. ఘటన వివరాల్లోకి వెళితే సూర్యాపేట సుందరయ్యనగర్‌కు చెందిన నాగమణి (24), సమీపంలోని దుబ్బతండాకు చెందిన ధరావత్ నెహ్రు (28) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రు బేల్దారి మేస్త్రిగా పనిచేస్తుండగా.. నాగమణి ఇటీవలే నర్సింగ్ పూర్తిచేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది.

Read More : Elephant Attack : ఈ డ్రైవర్ ధైర్యానికి మెచ్చుకోవాలి.. ఏనుగు దాడి చేసినా సీట్లోంచి కదల్లేదు

కొద్దీ రోజుల క్రితం ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారు. అబ్బాయి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోగా, అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రేమ విషయం తెలిసిన మరునాటి నుంచే నాగమానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

విషయం తెలుసుకున్న నెహ్రూ మనస్తాపం చెంది తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతడు చనిపోయాడన్న వార్త విన్న నాగమణి కూడా అదే రోజు హైదరాబాద్ లోని హఫీజ్‌పేట్‌- చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నాగమణి మృతదేహం స్వాధీనం చేసుకొని.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

Read More : Gulab Cyclone : ఏపీలో ‘గులాబ్’ బీభత్సం…పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు

పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సూర్యాపేట సమీపంలోని సుందరయ్యనగర్ కు తీసుకొచ్చి ఖననం చేశారు. నాగమణి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నాంపల్లి రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతోనే పెండ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. కులం ఇద్దరి ప్రాణం తీసింది కాదా అని పలువురు వాపోతున్నారు.