Gold Price Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా మూడోరోజూ తగ్గుదల చోటుచేసుకోవటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Gold price
Gold and Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటకలిగించేలా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా వరుసగా ధరలు తగ్గుతుండటంతో గోల్డ్, సిల్వర్ కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాలకుతోడు పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో గోల్డ్ దుకాణాలు రద్దీగా మారాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం తులం బంగారంపై రూ. 100, కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గుదల కనిపించింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,890కు చేరింది.

GOLD
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,040కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 100 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ 60,230 గా ఉంది.
– బెంగళూరులో 10గ్రాములు 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 54,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,890గా ఉంది.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,900 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59,890గా ఉంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. వెయ్యి తగ్గింది. దీంతో ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 77,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 77,500, ముంబయిలో రూ. 74,000, ఢిల్లీలో రూ. 74,000, కోల్‌కతాలో 74,000, బెంగళూరులో రూ. 73,000, కేరళ రాష్ట్రంలో 77,500 వద్ద కొనసాగుతోంది.