Gold and Silver Price Today: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖ పట్టణంలలో ఆదివారం నమోదైన ధరలను పరిశీలిస్తే ..

Gold Rate
Gold and silver prices on September 24th: తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే మహిళలకు షాకిచ్చేలా ధరలు పెరిగాయి. ఆదివారం బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. బంగారం ధర 10 గ్రాములపై రూ. 110 పెరిగగా, కిలో వెండి రూ. 300 పెరిగింది. సెప్టెంబర్ 24న బులియన్ మార్కెట్ లో విడుదలైన బంగారం, వెండి కొత్త ధరలను పరిశీలిద్దాం..

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. దీంతో ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖ పట్టణంలలో ఆదివారం నమోదైన ధరలను పరిశీలిస్తే.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59,950 వద్ద కొనసాగుతుంది.

Gold
దేశవ్యాప్తంగా ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,100.(శనివారంతో పోల్చుకుంటే రూ.160 పెరిగింది)
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,210 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,230 (శనివారంతో పోల్చుకుంటే రూ.120 పెరిగింది).
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.
– కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.

Gold
పెరిగిన వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 300 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి రూ. 79,300 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79,300, ముంబయి, ఢిల్లీ, కోల్ కతా వంటి ప్రాంతాల్లో రూ. 75,800, బెంగళూరులో కిలో వెండి రూ. 74,250 వద్ద కొనసాగుతుంది.