Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది.

Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

Gold (Google image)

Updated On : August 31, 2023 / 8:07 AM IST

Gold and Silver Price 31st August 2023: బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్‌కుతోడు  రాఖీ పండుగ కావడంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అక్కా, చెల్లికి రాఖీ పండుగ రోజు బంగారం బహుమతిగా ఇచ్చేందుకు ఎక్కువ మంది సోదరులు ఆసక్తి చూపుతుంటారు. దీంతో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం దుకాణాలు రద్దీగా కనిపించాయి. అయితే, తాజాగా బంగారం ధరలు పెరిగాయి. వరుసగా రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడ వంటి ప్రాంతాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారం ధరపై రూ. 300 పెరిగింది. దీంతో.. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,000 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 60వేల మార్క్‌కు చేరుకుంది.

Gold

Gold

దేశంలోని ప్రముఖ నగరాల్లో 10గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,150 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60వేల మార్క్‌‌కు చేరింది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 55వేలుకు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60వేల మార్క్‌కు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో కిలో వెండి ధర రూ. 80,700కు చేరింది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,600 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700, బెంగళూరులో 76,750, ముంబయిలో రూ. 77,600 కిలో వెండిధర ఉంది.