Gold Price Today: తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..
గత నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

Gold
Gold and Silver Price Today: గత నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. తాజాగా రూ. 54,100 వద్ద కొనసాగుతుంది. గత నెలరోజులుగా వెండి ధరలుసైతం తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర రూ. 73,300లుగా ఉంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలుకు మహిళలు మొగ్గుచూపుతున్నారు.

Gold
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలు శనివారంతో పోలిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 59,020 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో 10గ్రాముల బంగారం ధరలు పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,250 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,170గా ఉంది.
– ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, కేరళ వంటి నగరాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24క్యారెట్ల బంగారం ధర రూ. 59,020గా ఉంది.

Gold
వెండి ధరలుసైతం శనివారంతో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణాల్లో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. అదేవిధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 73,300 , చెన్నైలో రూ. 76,500, ముంబైలో 73,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500గా ఉంది.