మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ ప్ర‌భుత్వం న్యూ ఇయ‌ర్ కానుక‌..!

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం మందుబాబుల‌కు శుభవార్త అందించింది.

మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ ప్ర‌భుత్వం న్యూ ఇయ‌ర్ కానుక‌..!

Good News for Alcohol Lovers on december 31st liquor shops open till midnight

Updated On : December 28, 2024 / 11:35 AM IST

కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికేందుకు అంద‌రూ సిద్ధం అవుతున్నారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకునేందుకు ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌తి ఏడాది ఆఖ‌రి రోజున చేసే హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక మందుబాబుల గురించి చెప్పేది ఏముంది. మిగ‌తా రోజుల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే.. ఆ రోజు మాత్రం గొంతులో మందు ప‌డాల్సిందే.

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం మందుబాబుల‌కు శుభవార్త అందించింది. డిసెంబర్ 31న తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు అర్థ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు తెర‌చుకోవ‌చ్చున‌ని తెలిపింది. ఈ విష‌యం తెలిసి మందుబాబులు తెగ ఖుషి అవుతున్నారు.

KTR: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్‌కు బిగ్‌షాక్‌.. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు

న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగే ఈవెంట్ల‌ను రాత్రి 1 గంట వ‌ర‌కే ప‌రిమితం చేసింది ప్ర‌భుత్వం. అదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ పై ఉక్క‌పాదం మోపుతోంది. ఈవెంట్స్‌లో డ్ర‌గ్స్ వినియోగించ‌కుండా ఆంక్ష‌లు విధించింది. ఎవ‌రైనా డ్ర‌గ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, త‌మ ద‌గ్గ‌ర ఉంచుకున్నా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది.

మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ంఎసీ) ప‌రిధిలో జ‌రిగే ఈవెంట్స్‌, పార్టీల‌పై పోలీసులు ఓ న‌జ‌ర్ ఉంచాల‌ని ఆదేశించింది.

Gossip Garage : క్యాబినెట్ విస్తరణ ఇంకెప్పుడు? నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఆలస్యానికి కారణమేంటి?