KCR: పూర్తిగా కోలుకున్న కేసీఆర్..! ఫాంహౌస్‌ను వీడి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారా?

పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని..

KCR: పూర్తిగా కోలుకున్న కేసీఆర్..! ఫాంహౌస్‌ను వీడి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారా?

Updated On : October 24, 2025 / 8:48 PM IST

KCR: సార్ ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఫాంహౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్..జూబ్లీహిల్స్ బైపోల్‌పై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. ముఖ్య నేతలంతా అటెండ్‌ అయ్యారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ.. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట గులాబీ బాస్. అంతేకాదు రివ్యూ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడిన తీరు కూడా లీడర్లలో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపిందట. ముందుగా కేసీఆర్‌ ఫుల్ యాక్టీవ్‌గా కనిపించడమే లీడర్లకు ఎక్కడా లేని సంతోషం నింపిందట.

ఇక ప్రజా సమస్యలు, జూబ్లీహిల్స్‌లో ఉన్న పరిస్థితులపై కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా నేతలను అ్రటాక్ట్ చేశాయట. ఫాంహౌస్‌లో ఉన్నప్పటికీ సార్‌ ప్రతీ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని..వచ్చేసారి అధికారం మనదే అని కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని లీడర్లు తెగ హ్యాపీ అయిపోయారట.

ఈ క్రమంలోనే అనారోగ్యం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు చెబుతున్నారు బీఆర్ఎస్‌ ముఖ్యనేతలు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో గులాబీ బాస్ చాలా యాక్టీవ్‌గా కనిపించారని అంటున్నారు లీడర్లు. మీటింగ్‌కు వచ్చిన వారందరిని పేరు పేరునా పలకరించారట. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడంతో పాటు తన దృష్టికి వచ్చిన అంశాలను కూడా ప్రస్తావించారట. చాలా రోజుల తర్వాత తమ అధినేత అంత యాక్డీవ్‌గా..అధికారంలో ఉన్నంత జోష్‌లో కనిపించడంతో బీఆర్ఎస్ నేతలు హ్యాపీ అయిపోతున్నారు.

నేతల్లో నూతన ఉత్తేజం నింపిన కేసీఆర్ మాటలు..

ఇక ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన భరోసా గులాబీ నేతల్లో నూతన ఉత్తేజం నిపిందట. రెండేళ్లు కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని, జనానికి కాంగ్రెస్ సర్కార్‌పై నమ్మకం పోయిందని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు కేసీఆర్. ఇదే సమయంలో వచ్చే రెండున్నరేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధినేత కేసీఆర్ నమ్మకంగా చెప్పడం బీఆర్ఎస్ నేతలకు బూస్టప్‌ ఇచ్చిందట.

మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్న సార్..

ఫాంహౌస్‌ మీటింగ్‌లో గులాబీ బాస్ మాట తీరును గమనించిన కారు పార్టీ లీడర్లు..సార్‌ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక సభలో పాల్గొంటారని అంటున్నారు. ఇక ఇక్కడి నుంచి మునుపటిలా యాక్టీవ్ కాబోతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి..ఇప్పటినుంచే ప్రత్యేక కార్యాచరణతో మందుకెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్.

ఈ క్రమంలోనే ఇకపై కేసీఆర్ రెగ్యులర్‌గా తెలంగాణ భవన్‌కు రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ లీడర్లతో వరుస సమావేశాలు, కార్యకర్తల మీటింగ్‌లు, ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించడం వంటి యాక్టివిటీతో గులాబీ దళపతి బిజీ బిజీగా గడపనున్నారని ముఖ్య నేతలు చెబుతున్నారు.

పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో యూజ్‌ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా సార్ ఫుల్‌ యాక్టీవ్‌గా కనిపించడంతో లీడర్లకు తిరిగి అధికారంలోకి వచ్చినంత ఆనందం కలిగిందని అంటున్నారు.