Gossip Garage : బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు..! పార్టీపై పట్టు కోసం ఆ ఇద్దరి ప్రయత్నాలు..!

నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.

Gossip Garage : బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు..! పార్టీపై పట్టు కోసం ఆ ఇద్దరి ప్రయత్నాలు..!

Updated On : January 2, 2025 / 11:25 PM IST

Gossip Garage : నాకు అయితే అధ్యక్ష పదవి వద్దు. నాకు రథసారధి పదవి ఇవ్వాలని అడుగుతున్నా అధిష్టానం కుదరదంటోంది. అలాంటప్పుడు మనకు దక్కని పదవి.. మన అనుకున్న వాళ్లకు దక్కితే..పార్టీలో మనం ఏది చెప్తే అది నడుస్తుందని తెగ ఆరాట పడుతున్నారట తెలంగాణ బీజేపీ అగ్రనేతలు. అధ్యక్ష రేసులో ఉన్న లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉండగా.. తాము చెప్పినట్లు నడుచుకునే నేతలకు పదవి దక్కేలా పావులు కదుపుతున్నారట ముఖ్య లీడర్లు. దీంతో కమలం పార్టీలో ఆధిపత్య పోరు పీక్‌ లెవల్‌కు చేరుకుందన్న టాక్ వినిపిస్తోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.? అధ్యక్ష రేసు అగ్రనేతల మధ్య కాక పుట్టిస్తుందా.?

కమలం పార్టీలో ఆసక్తికరంగా ఆధిపత్య పోరు..
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కాక రేపుతోంది. ఎందరో ఆశావహులు.. ఇంకెన్నో ఊహాగానాలు మధ్య స్టేట్‌ ప్రెసిడెంట్ ఎంపిక క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత వడపోత పూర్తవగా..ఇంకా కొంతమంది నేతల పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అందులో కొందరు పార్టీని అంటి పెట్టుకుని వాళ్లు అయితే..మరికొందరు మాస్ లీడర్లు ఉన్నారు. వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో అగ్రనేత సపోర్ట్ చేస్తుండటంతో కమలం పార్టీలో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.

Kishan Reddy

Kishan Reddy

పార్టీ అధ్యక్షుడిని అయితే నేను కావాలి. లేకపోతే నా అనుకున్న వారికి ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర ప్రపోజల్స్ పెడుతున్నారట లీడర్లు. ఇప్పటికే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రాంచందర్ రావు, పాయల్ శంకర్, మనోహర్ రెడ్డి, రామచందర్ రావులు రేసులో ఉన్నారు. ఆశావహులు ఇప్పటికే అధినాయకత్వానికి తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. ఇప్పుడు వారి తరుఫున అగ్రనేతలు కూడా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.

Also Read : నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?

తమ వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి..!
రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు వారి అనుచరుల పేర్లు తెరపైకి తెచ్చినట్లు టాక్. రేసులో చాలామంది ఉన్నప్పటికీ ఆర్ఎస్‌ఎస్‌కు దగ్గరగా ఉన్న నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్‌ పెట్టారట ఆ ఇద్దరు లీడర్లు. చింతల రాంచంద్రారెడ్డి, పాయల్ శంకర్లలో ఒకరికి ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంచందర్ రావు, మనోహర్ రెడ్డిలలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి సూచించారట. అయితే ఈ ఇద్దరు ముఖ్యనేతలు సూచనలు, సలహాల దగ్గరే ఆగకుండా తమ వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తారని చర్చించుకుంటున్నారు. తాను ప్రపోజ్ చేసిన వారికే అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రాష్ట్ర పార్టీలో పట్టు సాధించ్చవచ్చనే యోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

అయితే అధికారికంగా అధ్యక్షుడిని ప్రకటిస్తే ఈ ఇద్దరి నేతల్లో..అధిష్టానం దగ్గర ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉందో స్పష్టం కానుంది. అయితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సూచించిన నేతలకు అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయా లేక.. ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లుగా పేరున్న నేతల్లో ఎవరో ఒకరు స్టేట్‌ ప్రెసిడెంట్ కాబోతున్నారా అనేది సంక్రాంతి తర్వాత తేలనుంది.

 

Also Read : రైతు కూలీలకు ఆర్థిక సాయం..! రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఏంటి?