టాలీవుడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్‌.. ఆ అనుమానమే కారణమా?

ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమను టార్గెట్‌ చేసినట్లు సీఎం కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్న సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు.

టాలీవుడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్‌.. ఆ అనుమానమే కారణమా?

Cm Revanth Reddy On Tollywood : టాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు టాలీవుడ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీఎం…. డ్రగ్స్‌ నియంత్రణలో సహకరించాలని సినీ పరిశ్రమను కోరారు. ఈ సందర్భంలోనే తనదైన మాట తీరుతో ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు సీఎం. ఎన్నడూ లేనట్లు సీఎం వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌… అసలు టాలీవుడ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు వెనుక కారణమేంటి?

ఇంకేదో కారణంతోనే అలా అన్నారా?
టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పరిశ్రమ పెద్దలకు షాక్‌నిచ్చాయా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమను టార్గెట్‌ చేసినట్లు సీఎం కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్న సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు.

సినిమా టికెట్లు పెంచమని తమ వద్దకు వస్తుంటారు? షూటింగ్‌లకు అనుమతుల కోసం తమను కలుస్తుంటారు.. కానీ డ్రగ్స్, సైబర్‌ క్రైం నియంత్రణ వంటి విషయాల్లో ప్రభుత్వానికి సహకరించడం లేదని సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీఎం రేవంత్‌రెడ్డి. సినిమాల్లో యాడ్స్‌ వేయడం ద్వారా డ్రగ్స్‌, సైబర్‌ క్రైంపై ప్రజలను అప్రమత్తం చేయాలనే సూచనలే సీఎం వ్యాఖ్యలుగా చెబుతున్నా… ఇంకేదో కారణంతోనే రేవంత్‌రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమ ఏపీకి తరలితే రాజకీయంగా నష్టం జరుగుతుందని..!
టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన పరిణామాలే సీఎం రేవంత్‌రెడ్డి అలా స్పందించేలా చేశాయంటున్నాయి సినీ వర్గాలు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంతమంది సినీ పెద్దలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమను ఏపీకి తరలిస్తారనే చర్చలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను సన్మానించేందుకు అనుమతి కోరారట… ఈ విషయం తెలిసిన రేవంత్‌రెడ్డి ఆగ్రహించారంటున్నారు. సినీ పరిశ్రమ ఏపీకి తరలితే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన సీఎం… ఇండస్ట్రీ పెద్దలకు ఓ ఝర్క్‌ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేశారా? అని అనుమానిస్తున్నారు.

ఇదే సమయంలో తాము ఎంత సహకరించినా ఇండస్ట్రీ తరపున ఎలాంటి అభినందన కార్యక్రమం నిర్వహించలేదనే అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉందంటున్నారు. అందుకే ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా సీఎం టాలీవుడ్‌కు షాకిచ్చేలా కామెంట్‌ చేశారంటున్నారు.

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఇండస్ట్రీలో కొందరు సమర్థిస్తున్నారు. సామాజిక బాధ్యతగా డ్రగ్స్‌ నియంత్రణకు ప్రచారం చేయడంలో తప్పేముందని కొందరి వాదన. ఇదే సమయంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు తెలంగాణ సీఎంను సత్కరించాలని ఇండస్ట్రీ పెద్దలకు సూచనలు అందుతున్నాయంటున్నారు. ఏదిఏమైనా సీఎం రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ తెలుగు సినీ ఇండస్ట్రీకి షాకింగ్‌గానే చెబుతున్నారు.

Also Read : క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్.. ఆ నలుగురికి ఛాన్స్..! కేటాయించే శాఖలపై ఉత్కంఠ