Green Apple: తెలంగాణలోని 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు.. ఇవి ఎందుకు ఇస్తారో తెలుసా?

గ్రీన్‌ యాపిల్‌ సంస్థను 1994లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి...

Green Apple: తెలంగాణలోని 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు.. ఇవి ఎందుకు ఇస్తారో తెలుసా?

Green Apple Environment Awards

Updated On : June 15, 2023 / 5:39 PM IST

Green Apple – Environment Awards: పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సహించే లండన్‌(London)కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ(Telangana)కు చెందిన అయిదు నిర్మాణాలకు అవార్డులు దక్కాయి.

హెరిటేజ్‌ విభాగంలో మోజంజాహీ మార్కెట్‌, ప్రత్యేక డిజైన్‌ లో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, కార్యస్థలాల భవనాల విభాగంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం, ప్రత్యేకమైన కార్యాలయాల విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మతపర నిర్మాణం విభాగంలో యాదాద్రి ఆలయాన్ని అవార్డులకు ఎంపిక చేసింది. లండన్ లో ఈ నెల 16న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది.

ఎందుకు ఇస్తారు?
గ్రీన్‌ యాపిల్‌ సంస్థ 2016 నుంచి అవార్డులను ప్రదానం చేస్తోంది. పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. నివాస, కార్యాలయ భవనాలు, కోటలు, మ్యూజియంలు, వంతెనలు, మతపర కట్టడాల వంటి వాటిని పరిశీలిస్తారు.

గ్రీన్‌ యాపిల్‌ సంస్థను 1994లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. పర్యావరణం విషయంలో కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలకు అవార్డులు ఇస్తోంది. పలు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రతి ఏడాది అందిస్తారు. అందుకోసం నామినీలను ముందు నుంచే ఆహ్వానిస్తారు.

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై హైకమాండ్ కీలక నిర్ణయం