రేపు మీరు రమ్మంటే ఉదయం 9 గంటలకు మీ ఇంటికి వస్తాను: హరీశ్ రావు సవాల్

మల్లన్నసాగర్, కొండ పోచమ్మ,రంగ నాయక్ సాగర్ దగ్గర చెట్టు కింద మాట్లాడుకుందామని చెప్పారు.

రేపు మీరు రమ్మంటే ఉదయం 9 గంటలకు మీ ఇంటికి వస్తాను: హరీశ్ రావు సవాల్

BRS MLA Harish Rao

Updated On : October 18, 2024 / 4:23 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ ప్రతి సవాల్ విసిరారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం రేవంత్ రెడ్డి రమ్మంటే రేపు ఉదయం 9 గంటలకు ఆయన ఇంటికి వస్తా… బిజీ షెడ్యూల్ ఉంటే తేదీ, సమయం రేవంత్ రెడ్డి డిసైడ్ చేయాలి. నేను కార్ నడిపిస్తా.. ఇద్దరమే వెళ్దాం.

మూసీ నుంచి పర్యటన మెదలు పెడదాం. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ,రంగ నాయక్ సాగర్ దగ్గర చెట్టు కింద మాట్లాడుకుందాం. ఇచ్చిన హామీలను అమలు చేయలేక మూసి పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు. సీఎం అద్భుత విన్యాసం చూసి చిన్న పిల్లలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ కు గుజరాత్,మధ్యప్రదేశ్ లో ఒక్క సీటు రాలేదు.

నిన్నటి ప్రెస్ మీట్ తో సీఎం గౌరవాన్ని తగ్గించుకున్నారు. అబద్ధమే ఆశ్చర్య పోయేలా సీఎం మీడియా సమావేశం జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసేందుకు ఏఐ టెక్నాలజీ వాడారు. సీఎం ప్రదర్శించిన వీడియోలో అన్ని అందమైన భవంతులే కనిపించాయి. మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.

మేము ఎప్పుడో మూసీని కాపాడేలా చర్యలు తీసుకున్నాం. మూసీ ముసుగులో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేయాలని సీఎం చూస్తున్నారు. ఇళ్లు కూల గొట్టే పని నుంచి సీఎం మొదలు పెట్టారు. 2013 పునరావాస చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? మూసి సమీప ప్రాంతాల ప్రజలపై ఆక్రమణదారులుగా ముద్ర వేశారు” అని చెప్పారు.

తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఏ వర్సిటీకి ఎవరంటే?