తెలంగాణకు అసలు విలన్ ఆ పార్టీనే.. కేసీఆర్ తొలి నుంచి చెబుతున్న మాటలు అక్షరసత్యం అయ్యాయి.. హరీశ్ రావు

Harish Rao Power Point Presentation : నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహులు అంశంపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై కీలక కామెంట్స్ చేశారు.

తెలంగాణకు అసలు విలన్ ఆ పార్టీనే.. కేసీఆర్ తొలి నుంచి చెబుతున్న మాటలు అక్షరసత్యం అయ్యాయి.. హరీశ్ రావు

Power Point Presentation

Updated On : January 4, 2026 / 1:33 PM IST

Harish Rao Power Point Presentation : తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యంవ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహులు అంశంపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Also Read : Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్‌ సక్సెస్.. తొలి విమానం దిగింది.. వీడియో వైరల్

తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని.. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టుకథలు, రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్పారు అంటూ మండిపడ్డారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని హరీశ్ రావు అన్నారు.

పాలమూరుకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ, కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. విభజన సమయంలోనూ మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 11వ షెడ్యూల్‌లో పాలమూరు – రంగారెడ్డి పెట్టలేదు. ఇలా అనేక విషయాల్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ హరీవ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదటి నుంచి కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 40రోజుల్లోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారు. కేసీఆర్ ప్రశ్నించిన తరువాత ప్రాజెక్టులను అప్పగించబోమని అసెంబ్లీ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 11 ప్రాజెక్టులకు డీపీఆర్ లు పంపాం.. ఏడు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు సాధించాం. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క డీపీఆర్ కూడా పంపలేదు.. మూడు డీపీఆర్ లు వెనక్కి తెచ్చారని హరీశ్ రావు అన్నారు. మా సక్సెస్ రేట్ 60శాతం, కాంగ్రెస్ సక్సెస్ రేట్ మైనస్30శాతం అని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కృష్ణా నీళ్లపై అవగాహన లేదు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు.. మరోవైపు కాళేశ్వరంపై కక్షగట్టారు.. పాలమూరుపై పగబట్టారు అంటూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాయలసీమ లిఫ్ట్ పనులు మేమే..
రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది కాంగ్రెస్ అని రేవంత్ అబద్ధాలు చెబుతున్నాడు. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం 05-05-2020 నాడు జీవో జారీ చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే ఐదు నెలల ముందే అంటే, 29-01-2020 నాడే వార్తా పత్రికా వార్తల ఆధారంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికీ, KRMBకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశామని హరీశ్ రావు అన్నారు. నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని 22 అక్టోబర్ 2020న జరిగిన రెండో అప్లెక్స్ కౌన్సిల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తెగేసి చెప్పింది. పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టడంపై NGTలో కేసు వేసి 24.02.2021 నాడు స్టే సాధించి పూర్తిగా ప్రాజెక్టు పనులు నిలిచి పోయేలా అడ్డుకున్నదే బీఆర్ఎస్ అని హరీష్ రావు అన్నారు.