నోటరీ మీద రాసిచ్చి మాట తప్పినందుకు ఎవరిపై కేసు పెట్టాలి?: హరీశ్ రావు

Harish Rao: ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామన్నారని హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ముక్కు పిండి..

నోటరీ మీద రాసిచ్చి మాట తప్పినందుకు ఎవరిపై కేసు పెట్టాలి?: హరీశ్ రావు

HARISH RAO

Updated On : March 6, 2024 / 4:24 PM IST

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తేనే ఆ పార్టీకి ఓట్లు ఆడిగే హక్కు ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై రైతులు ఓట్లు వేయాలని అన్నారు.

ఎన్నికల వేళ కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు మంచి నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ నుంచి 4 వేల పెన్షన్ ఇస్తామని నోటరీ చేసి పంచారని చెప్పారు. నోటరీ మీద రాసిచ్చి మాట తప్పినందుకు ఎవరిపై కేసు పెట్టాలని నిలదీశారు. జనవరిలో ఎవరికీ పెన్షన్ అందలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, రైతుబంధు, విద్యుత్, ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. తెలంగాణలో కరవు వచ్చిందన్న చర్చ జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు అమలు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కాంగ్రెస్‌కు హరీశ్ రావు సవాలు విసిరారు.

ఎల్ఆర్ఎస్ గురించి..
ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామన్నారని హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ఇవ్వడం లేదని చెప్పారు. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాలని అంటున్నారని అన్నారు. నిబంధనల పేరుతో పథకానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. దళితబంధు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారుని, దళితులు దీనిపై ఆలోచించాలని ఆయన అన్నారు.

బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో గరం గరం.. గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై?