Heavy Rainfall: మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన

తెలంగాణలో మరో మూడు.. నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్యబంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో

Heavy Rainfall: మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన

Heavy Rain Fall

Updated On : September 3, 2021 / 3:24 PM IST

Heavy Rainfall: తెలంగాణలో మరో మూడు.. నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్యబంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంలో మార్పులు కనిపిస్తున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుండి 3.1 కిలో మీటర్ల మధ్య కేంద్రీకృతమై దక్షిణానికి వంగి ఉంది.

తూర్పు-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి.మీ, 5.8 కి.మీ మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 6 నుండి 12 తేదీల మధ్యలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

శుక్ర, శని వారాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రదేశములో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.