Heavy Rains : భైంసాలో వరద బీభత్సం.. నీటిలో చిక్కుకున్న 20 మంది
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగుల్లో వరద పోటెత్తుతోంది. బైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సమీపంలోని ఆటో నగర్ లో ప్రాంతంలోకి నీరు చేరింది.. ఈ నీటిలో 20 మంది చిక్కుకుపోయారు.. నాటు పడవల సాయంతో వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుంది.

Heavy Rains
Heavy Rains : నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగుల్లో వరద పోటెత్తుతోంది. బైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సమీపంలోని ఆటో నగర్ లో ప్రాంతంలోకి నీరు చేరింది.. ఈ నీటిలో 20 మంది చిక్కుకుపోయారు.. నాటు పడవల సాయంతో వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుంది.
వర్షాల దాటికి బైంసా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనేక కాలనీలు నీటమునిగాయి. ఇక దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు.. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నిర్మల్ జిల్లాకు పంపాలని ఆదేశించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది.. దీంతో చాలాగ్రామాలు నీట మునిగాయి. స్థానిక అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఒక్క తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదనీరు కృష్ణా, గోదావరి నదుల్లోకి చేరింది. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులు క్రమంగా నిండుతున్నాయి. ఇక గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు చాలా వరకు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరాయి.