Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలి‌క‌పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశముందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

Heavy rains in Telangana (1)

Updated On : October 15, 2022 / 12:50 PM IST

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలి‌క‌పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశముందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి

శని‌వారం ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహ‌బూ‌బా‌బాద్‌, వరం‌గల్‌, జన‌గామ, యాదాద్రి భువ‌న‌గిరి, రంగా‌రెడ్డి, హైద‌రా‌బాద్‌, మేడ్చల్‌ మల్కా‌జి‌గిరి, వికా‌రా‌బాద్‌, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నారా‌య‌ణ‌పేట జిల్లాల్లో అక్కడ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.