Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ..

Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Raghunandan Rao

Updated On : September 20, 2024 / 8:23 AM IST

BJP MP Raghunandan Rao : మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు సీజే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Also Read : Kolkata : రేపటి నుంచి విధుల్లోకి జూనియర్ వైద్యులు.. మమత సర్కార్‌కు వారంరోజులు గడువు

సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం కూల్చివేతలపై స్టేటస్ కో ఇచ్చింది. అప్పటికే హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే, ఈ జడ్జిమెంట్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగస్టు 24న విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హైకోర్టు తీరుపై విమర్శలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు.

 

హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు లేఖ రాశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై సీజే అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు కోర్టు క్రిమినల్ ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.