Harish Rao: హైకోర్టులో హరీశ్ రావుకి రిలీఫ్.. వనపర్తి జిల్లాలో బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్
గొల్లపల్లి రిజర్వాయర్ ను వ్యతిరేకిస్తూ రేపు బహిరంగ సభకు పిలుపునిచ్చారు హరీశ్ రావు.
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుకి హైకోర్టులో ఊరట లభించింది. వనపర్తి జిల్లాలో హరీశ్ రావు బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు గొల్లపల్లిలో హరీశ్ రావు బహిరంగ సభ ఉండనుంది. బహిరంగ సభకు అనుమతుల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టింది హైకోర్టు. గొల్లపల్లి రిజర్వాయర్ ను వ్యతిరేకిస్తూ రేపు బహిరంగ సభకు పిలుపునిచ్చారు హరీశ్ రావు. అయితే, పోలీసులు ఇందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు హరీశ్ రావు. కోర్టులో ఆయనకు రిలీఫ్ లభించింది. హరీశ్ రావు బహిరంగ సభకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
