High Court Key Verdict : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

SUNIL
High Court Key Verdict : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని సునీల్ ను కోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సునీల్ కనుగోలు సహకరించాలని సూచించింది.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం
ఈ నెల 8న విచారణకు సునీల్ కనుగోలు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించింది. అయితే స్టే ఇవ్వాలని కోరిన సునీల్ కనుగోలు విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.