Telangana High Court : కరోనా నియంత్రణపై చర్యలేవి..బార్లు, పబ్బుల్లో రద్దీని నియంత్రించారా ? హైకోర్టు ప్రశ్నలు

తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Telangana High Court : కరోనా నియంత్రణపై చర్యలేవి..బార్లు, పబ్బుల్లో రద్దీని నియంత్రించారా ? హైకోర్టు ప్రశ్నలు

Telangana Corona

Updated On : April 19, 2021 / 2:23 PM IST

High Court anger Telangana govt increasing Covid cases : తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం పరిస్థితులే ఈసారి కూడా కనబడుతున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్, బెడ్ కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మాస్క్, నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెబుతోంది. కానీ..కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటుండడంతో కేసులు పెరిగిపోతున్నాయి.

అయితే..తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌ల్లో రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ప్రజల ప్రాణాల కంటే పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని నిలదీసింది. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ఏజీ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు గాల్లో వేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించింది హైకోర్టు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 2021, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..వారిలో 4,009మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

Read More : Mars Helicopter : అంగారకుడిపై నాసా హెలికాప్టర్