tension at Gandhi Hospital : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్..
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. వరంగల్ కేయూ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసి.. మృతి చెందిన సునీల్‌కు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, సునీల్ బంధువులు ఆందోళనకు దిగారు.

High Tension At Gandhi Hospital Hyderabad
tension at Gandhi Hospital : హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. వరంగల్ కేయూ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసి.. మృతి చెందిన సునీల్‌కు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, సునీల్ బంధువులు ఆందోళనకు దిగారు. గాంధీ ఆస్పత్రికి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని.. గాంధీ మార్చూరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా గాంధీ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులు, సునీల్ బంధువుల నిరసనకు మద్దతు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తేజావత్ రామ్ సింగ్ తాండకు చెందిన సునీల్….ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మార్చి 28న వరంగల్ కేయూ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన ఆవేదన సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.