Nagarjunasagar Project : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మరోసారి ఉద్రిక్తత.. 13వ నెంబర్ గేటు వరకు చొచ్చుకెళ్లి ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి

సాగర్‌ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

Nagarjunasagar Project : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మరోసారి ఉద్రిక్తత.. 13వ నెంబర్ గేటు వరకు చొచ్చుకెళ్లి ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి

Nagarjunasagar project

High Tension at Nagarjunasagar Project : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు భారీగా ఏపీ పోలీసులు చేరుకున్నారు. అర్ధరాత్రి నాగార్జునసాగర్‌ వద్ద భారీగా ఏపీ పోలీసులు మోహరించారు. సాగర్ రైట్ కెనాల్ కు నీటి విడుదల కోసం ఏపీ పోలీసులు అక్కడికి వచ్చారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

నాగార్జునసాగర్‌ డ్యామ్‌ 13వ నంబర్ గేటు వరకు ఏపీ పోలీసులు వెళ్లారు. ప్రాజెక్టు వద్ద ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి చేశారు. నాగార్జునసాగర్‌ వద్ద సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సాగర్‌ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నాగార్జునసాగర్‌ వద్ద మీడియా ప్రతినిధులపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maoists : 25మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

నాగార్జునసాగర్‌ వద్ద ఏపీ పోలీసులు మీడియా ప్రతినిధులు ఫోన్లను లాక్కున్నారు. ప్రస్తుతం 13వ గేట్ వరకు చొచ్చుకొని వచ్చారు. 13వ గేట్ వద్ద బారికేడ్ ఏర్పాటు చేసుకొని పోలీసులు ఏపీ వైపు మోహరించారు. ఏదైనా ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడుకోవాలని ఎస్పీఎఫ్, తెలంగాణ పోలీసులు చెప్పారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొంది.

నాగార్జున సాగర్ గొడవపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసేందుకు రాత్రికి రాత్రే నీటి కోసం గొడవ సృష్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.